కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన కుర్మ లక్ష్మణ్(38) అనే వ్యక్తి పిడుగుపడి మృతి చెందాడు. లక్ష్మణ్ తన కుమారుడు సతీశ్ తో కలిసి పొలం నుంచి ఇంటికి వస్తుండగా వాన కురుస్తోందని ఓ చెట్టుకింద ఆగారు. ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ పిడుగు పడగా లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా అతని కుమారుడు సతీశ్‌కి గాయాలయ్యాయి. సతీశ్‌ను చికిత్స నిమిత్తం స్థానికులు బాన్సువాడ ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్షల కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి పంపించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పిడుగుపాటుకు ఒకరి మృతి - One Person Death Thunderbolt
పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపడి ఒకరు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో జరిగింది. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పిడుగుపాటుకు ఒకరి మృతి