తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించాలని ఆందోళన - లింగంపేట పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన

కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీసు స్టేషన్​ ఎదుట నల్లమడుగు తండా వాసులు ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా చోటుచేసుకున్న వివాదంలో పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించాలని ఆరోపించారు.

nallamadugu thanda people protest at police station
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించాలని ఆందోళన

By

Published : Apr 24, 2020, 8:38 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు తండాలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించాలని పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం ఉపాధి హామీ పనుల్లో భాగంగా ధరావత్ ఈశ్వర్, సర్పంచ్ ధరావత్ రవీందర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఓ వర్గం వారిని కామారెడ్డి ఆసుపత్రికి, మరో వర్గాన్ని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధూప్​సింగ్​కు మెరుగైన చికిత్స అందించాలని అసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీస్ వాహనంలో కామారెడ్డికి తీసుకెళ్తుండగా లింగంపేట ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీస్ స్టేషన్ వద్ద బంధువులు వాహనాన్ని అడ్డుకున్నారు. డీఎస్పీ శశాంక్ రెడ్డి చేరుకొని వాహనాన్ని కామారెడ్డికి తరలించారు.

ఇదీ చూడండి:దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దు: సత్యవతి రాఠోడ్

ABOUT THE AUTHOR

...view details