కామారెడ్డి జిల్లా (kamareddy district) బాన్సువాడ మండలం బోర్లామ్ గురుకుల పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు ఇర్ఫానాబాను, హైమద్ దంపతులు... తమ ఔదార్యం చాటుకున్నారు (Muslim couple married to an orphan girl). అనాథ బాలికను ఆదరించి... విద్యాబుద్ధులు నేర్పించి.... పెళ్లి చేసి మానవత్వం చాటారు. తాడ్వాయి గురుకుల పాఠశాలలో ఇర్ఫానా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సమయంలో... తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన లింగంపేట్ మండలం శెట్పల్లికి చెందిన చందన(రజిత)ను బంధువులు ఆరో తరగతిలో చేర్పించారు. సెలవుల్లో అందరూ ఇళ్లకు వెళ్తుంటే... ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి చందనది. ఇది గ్రహించిన ఇర్ఫానా... చందనను తన ఇంటికి తీసుకెళ్లి పాఠశాల ప్రారంభం అయిన తర్వాత తీసుకొచ్చేవారు. ఇలా తమ వద్దే పదో తరగతి వరకు చదివించారు.
అనాథ అని తెలిసినా..
అనంతరం తాడ్వాయిలో ఇంటర్, బోధన్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో.. 70 వేల రూపాయలు ఖర్చు చేసి డీఎంఎల్టీ పూర్తి చేయించారు. అలాగే చందన (Orphaned young woman) పెళ్లి బాధ్యత కూడా వారే తీసుకున్నారు. నస్రుళ్లబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లికి చెందిన అనాథ యువకుడు వెంకట్రామ్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు (muslim couple marry off orphan girl to hindhu groom). వరుడు ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు