కామారెడ్డి జిల్లా కేంద్రంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది మహిళలతో కలశాల ఊరేగింపు చేపట్టారు. సంఘం భవనం నుంచి నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా స్నేహపురి మార్కండేయ ఆలయం వరకు కలశాల యాత్ర సాగింది.
ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు
మార్కండేయ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు 2వేల మంది మహిళలతో కలశాల ఊరేగింపు చేపట్టారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు
అనంతరం ఆలయంలో మార్కండేయునికి కలశాలలోని నీటితో అభిషేకం నిర్వహించారు. ఏటా మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని సంఘ ప్రతినిధులు అన్నారు. వరుసగా ఇది 4వ సంవత్సరమని పేర్కొన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు, సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష