జ్వరంతో బాధపడుతూ కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సుమలత అనే మహిళకు వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్ ఎక్కించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ మహిళ భర్త నాగేశ్... సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు పొరపాటు జరిగిందంటూ సరిపెట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై చరవాణిలో జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షణ అధికారి అజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
రోగికి గడువు ముగిసిన సెలైన్ ఎక్కించిన వైద్య సిబ్బంది - రోగికి గడువు ముగిసిన సెలైన్ ఎక్కించిన వైద్య సిబ్బంది
అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ మహిళకు వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్ ఎక్కించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూరు లో జరిగింది.
సెలైన్