కరెంట్ ఓవర్ లోడ్‌తో బోరు మోటార్లు కాలిపోతున్నాయని ఆరోపిస్తూ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ను సబ్‌స్టేషన్‌లో గ్రామస్థులు నిర్బంధించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ నిర్బంధించిన రైతులు - telangana news
కామారెడ్డి జిల్లాలో లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్య వైఖరికి గ్రామస్థులు తగిన బుద్ధి చెప్పారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తుతుండటంతో వారిని సబ్‌స్టేషన్‌లో నిర్బంధించారు.
లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ నిర్బంధం
మోటార్లు కాలిపోవడంతో పంటకు నీళ్లు పెట్టలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోయామని వాపోయారు. విద్యుత్ అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:తికమక పెట్టే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఎలా చేస్తారో తెలుసా..?