తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస ఎంపీలు గెలిస్తే... తెలంగాణ గడ్డకు లాభం'​ - 2019 elections

కామరెడ్డి జిల్లా మాచారెడ్డి పాల్వంచ మర్రి వద్ద కాంగ్రెస్​ నేతలు తెరాసలో చేరిక కార్యక్రమానికి ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ హాజరయ్యారు. తెలంగాణ ఎంపీలు గెలిపిస్తే... కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చుకోవచ్చని తెలిపారు.

'తెరాస ఎంపీలు గెలిస్తే... తెలంగాణ గడ్డకు లాభం'​

By

Published : Mar 29, 2019, 11:55 PM IST

'తెరాస ఎంపీలు గెలిస్తే... తెలంగాణ గడ్డకు లాభం'​
తెలంగాణ నుంచి కాంగ్రెస్​ అభ్యర్థులు గెలిస్తే రాహుల్​ గాంధీకి... భాజపా సభ్యులు గెలిస్తే మోదీకి... గులాబీ పార్టీ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పాల్వంచ మర్రిలో కాంగ్రెస్​ నాయకులు తెరాసలో చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి 16 ఎంపీలను గెలిపిస్తే... కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చుకోవచ్చని తెలిపారు. దేశంలో మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్​ గాడి తప్పిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​, భాజపా ఎంపీలను గెలిపించి దిల్లీకి గులాములు అవుదామా... తెరాస ఎంపీలను గెలిపించి తెలంగాణకు గులాబీలవుదామా? అని ఆలోచించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details