Kodipandalu 2022: సంక్రాంతి అంటే కోడి పందేలు. కోడి పందేలంటే గుర్తుకువచ్చేది ఆంధ్రప్రదేశ్. కానీ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో 3 రోజులుగా కోడి పందేలు నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు మాచారెడ్డి మండలం చుక్కపూర్ అటవీప్రాంతంలో పందెం రాయుళ్లను పట్టుకున్నారు.
Kodipandalu 2022: మూడు రోజులుగా కోడిపందెలు.. ఏపీలో కాదండి.. మనదగ్గరే! - కోడిపందేలు
Kodipandalu in Kamareddy: మూడు రోజుల నుంచి కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేలే కదా.. ఏపీలోనే అనుకుంటున్నారా? కాదండోయ్.. కామారెడ్డిలోనే ఈ పందేలను నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లేసరికి ఏమైందంటే..
కోడిపందెలు నిర్వహణ
పోలీసుల రాకతో జూదరులు పరుగులు తీశారు. పోలీసులు చాకచక్యంతో నిందితులను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్ సీఐ జాన్‌రెడ్డి, మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడుల్లో 54 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 20 వేల నగదు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:Extend Holidays for Educational Institutes: రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు?