తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్​

కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్​ శరత్​ పరిశీలించారు. శనివారం కురిసిన వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించి... మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

kamareddy collector examined the stained paddy at the buying centers
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్​

By

Published : May 10, 2020, 10:38 PM IST

కామారెడ్డి జిల్లాలో శనివారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన వరిధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన వరిధాన్యాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మండలం లింగపూర్, తాడ్వాయి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించి కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

17 శాతం తేమ వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని సూచించారు. అకాల వర్షం కురిసే అవకాశం ఉన్నందున రైతులు టార్పాలిన్​లను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, సహకార సంఘం సీఈవో మోహన్ రావు, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details