కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి 114, లింగంపేట్ 14, నాగిరెడ్డిపేట 58, చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దేవేందర్ రెడ్డి, తహశీల్దార్ మైపాల్, ఎంపీపీ నక్క గంగాధర్, జడ్పీటీసీ సామిల్, మూడు మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
ఎన్నికల కోడ్ అనంతరం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణీ చేశారు.
చెక్కుల పంపిణీ