తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధారాలు లేని 72 ద్విచక్ర వాహనాలు స్వాధీనం - BANSWADA DSP

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు.

సరైన ధ్రువపత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

By

Published : Apr 8, 2019, 12:32 PM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండేకేలూర్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. బాన్సువాడ డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. తెల్లవారు జాము నుంచే ఇంటింటికీ వెళ్లి పరిసరాలను గాలించారు. సరైన ధ్రువపత్రాలు లేని 72 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

తెల్లవారు జాము నుంచే నిర్బంధ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details