కొనుగోళ్లలో పారదర్శకత పాటించకపోవడం రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొనుగోలు కేంద్రం వద్ద సీరియల్ నెంబర్ కోసం తాము వరుసలో ఉండగా దళారులు తెచ్చిన ధాన్యం కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాస్తా పార్టీల మధ్య గొడవగా మారి.. కాంగ్రెస్ , తెరాస సానుభూతి రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పరస్పరం చెప్పులతో దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ చెప్పులతో దాడి చేసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం వల్లే ఇలా జరుగుతోందని రైతులు మండిపడ్డారు.
కళ్లముందే అన్యాయం.. రైతన్నల ఆగ్రహం.. - godava
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కొనుగోళ్లలో జాప్యం వల్లే ఇలా జరుగుతోందని రైతులు మండిపడ్డారు.
వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం