సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో చేపట్టిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే ముఖ్యమని, అందుకే సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టినట్లు ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజిబుద్దీన్, నిట్టు వేణుగోపాల్‌రావు, లద్దూరి మంగమ్మ, నిట్టు వెంకట్‌రావు, ఉర్దొండ నరేష్, బల్వంత్‌రావు, శంకర్‌రావు, భూంరెడ్డి, కృష్ణారావు, లక్ష్మీపతి పాల్గొన్నారు.
కామారెడ్డిలో జోరుగా తెరాస సభ్యత్వ నమోదు - kcr
తెరాస చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్దన్ పాల్గొన్నారు.
జోరుగా తెరాస సభ్యత్వ నమోదు.....