ప్రజావాణి కోసం దరఖాస్తుదారులు జిల్లా కేంద్రానికి రాకుండా... బాన్సువాడ డివిజన్‌లోనే తొలిసారిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శరత్ తెలిపారు.
బాన్సువాడ డివిజన్లో తొలి ప్రజావాణి కార్యక్రమం - బాన్సువాడ డివిజన్లో తొలి ప్రజావాణి కార్యక్రమం
కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ డివిజన్‌గా ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు దగ్గరుంటుందనే ఉద్దేశంతోనే డివిజన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శరత్ తెలిపారు.
బాన్సువాడ డివిజన్లో తొలి ప్రజావాణి కార్యక్రమం
ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో 25 మంది ఫిర్యాదుదారుల దరఖాస్తులు స్వీకరించామని జిల్లా పాలనాధికారి వెల్లడించారు. ఆయా సంబంధిత అధికారులకు ఆ ఫిర్యాదులు అందజేసి... సత్వర న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ చంద్రమోహన్ రెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్, డీఈఓ రాజు, డీఏఓ నాగేంద్ర, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ డీఎఫ్ వసంత బాన్సువాడ తహసీల్దార్ గంగాధర్ పాల్గొన్నారు.