కామారెడ్డి జిల్లా తాడ్వాయి సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం యూరియా లోడ్ వచ్చిందని తెలుసుకున్న రైతులు.. సహకార సంఘం వద్ద ఉదయం 6 గంటల నుంచే లైన్లలో నిల్చున్నారు. అయితే అందరికీ సరిపడా యూరియా లేకపోవడం వల్ల కొంతమందికి దొరికి మరికొంతమందికి అందకపోవడం వల్ల కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా కోసం బారులు... గంటల తరబడి నిల్చున్నా దొరకని దుస్థితి
నిన్నటి వరకు సోయా విత్తన కొరతతో ఇబ్బందులు పడిన కామారెడ్డి జిల్లా రైతులు తాజాగా యూరియా కోసం అవస్థలు పడాల్సి వస్తోంది. సహకార సంఘాల వద్ద యూరియా కోసం గంటల తరబడి బారులు తీరినా దొరకని దుస్థితి నెలకొంది.
యూరియా కోసం బారులు... గంటలతరబడి నిల్చున్నా దొరకని దుస్థితి
ఎన్నిసార్లు తిరిగినా యూరియా దొరకడం లేదని మండిపడ్డారు. మహిళా రైతులు సైతం యూరియా కోసం బారులు తీరారు. అయితే లాక్డౌన్ వల్ల రవాణా ఇబ్బంది ఉందని అందుకే యూరియా సరిపడా రాలేదని సొసైటీ సిబ్బంది తెలిపారు. లైన్లలో నిలబడినా యూరియా అందని రైతుల వివరాలు నమోదు చేసుకుని ఈసారి వచ్చే యూరియాని వీరికి మొదట అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సందేహానికి ప్రధాని స్పష్టత