కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి... వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు విని రైతులంతా సన్నరకం వరి సాగుచేశారని... భారీ వర్షాలు కురిసి దోమపోటు వ్యాపించిందని తెలిపారు.
'సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించండి' - దోమకొండలో రైతుల ధర్నా
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని... వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
'సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించండి'
పొలాల్లో నీళ్లు నిలిచి సాధారణ వరికోత మిషన్ నడవకపోవడం వల్ల బెల్ట్ మిషన్‌కు గంటకు రూ.4వేల వరకు చెల్లించి కోత కోస్తే... ధాన్యానికి రూ.3వేల ఆదాయం కూడా వచ్చేలా లేదని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతులు కోరారు.