తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్కెట్​ యార్డులో అక్రమాల జరుగుతున్నాయంటూ రైతుల నిరసన - కామారెడ్డి జిల్లా

కామారెడ్డి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్​ కమిటీ యార్డును ప్రైవేట్​ వ్యక్తులకు అప్పగించడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ రైతులు ఆందోళన చేపట్టారు.

'మార్కెట్​ యార్డులో అక్రమాలు జరుగుతున్నాయంటూ రైతుల నిరసన'

By

Published : Oct 11, 2019, 9:58 PM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్​లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులోని పెసర్ల కొనుగోలు కేంద్రంలో రైతులకు సంబంధించిన పంటను కాకుండా దళారులు, వ్యాపారుల పంటను కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు నిరసనకు దిగారు. పంటను అమ్ముకునేందుకు వారం రోజుల నుంచి మార్కెట్​లో పడిగాపులు కాస్తున్నా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రైవేట్ వ్యక్తికి అప్పజెప్పడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన సహకార సంఘం కార్యదర్శి బాబురావు, తాత్కాలిక సిబ్బంది చందర్​లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

'మార్కెట్​ యార్డులో అక్రమాలు జరుగుతున్నాయంటూ రైతుల నిరసన'

ABOUT THE AUTHOR

...view details