కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ ఉన్నందున హైదరాబాద్ నుంచి మూడు లారీల్లో 142 మంది కూలీలు కామారెడ్డి జిల్లా మద్నూర్ గుండా నాలుగు రోజుల క్రితం రాజస్థాన్ వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. వారందరిని స్థానిక గురుకుల పాఠశాలకు తరలించి... క్వారంటైన్ చేశారు. అక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు అధికారులు స్పందించి వారిని హైదరాబాద్‌కు పంపించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: రాజస్థాన్ కూలీలకు విముక్తి - ఈటీవీ భారత్ ఎఫెక్ట్
దండం పెడతాం...మమ్మల్ని వదిలేయండి అంటూ "ఈనాడు-ఈటీవీ భారత్"లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ గురుకుల పాఠశాలలో రాజస్థాన్ కూలీలు పడుతున్న ఇబ్బందులు వాస్తవమేనని అధికారులు తెలిపారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తరలించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: రాజస్థాన్ కూలీలకు విముక్తి