తెలంగాణ

telangana

ETV Bharat / state

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. కామారెడ్డిలో అప్రమత్తం - మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు

మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరగడంతో సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోకి వచ్చేవారికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం సలాబత్​పూర్ వద్ద అధికారులు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Corona cases in Maharashtra  Border districts alert in  telangana
కామారెడ్డి జిల్లా సరిహద్దులో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు

By

Published : Feb 24, 2021, 10:23 PM IST

మహారాష్ట్రలో కొవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని సరిహద్దు జిల్లాల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మళ్లీ వైరస్​ విజృంభించడంతో రాష్ట్రంలోకి వచ్చేవారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం సలాబత్​పూర్ పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

కామారెడ్డి జిల్లా సరిహద్దులో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు

కరోనా లక్షణాలు ఉంటే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. కొవిడ్​ కట్టడి కోసం మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు, ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి :మినీ మేడారంలో సీతక్క నృత్యం

ABOUT THE AUTHOR

...view details