తెలంగాణ

telangana

ETV Bharat / state

హోం ఐసోలేషన్​కు కాలనీవాసుల అభ్యంతరం

కరోనా బాధితుల పట్ల కాలనీవాసులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. భరోసా ఇవ్వాల్సిన తోటి వారే చీకొడుతున్నారు. హోం ఐసోలేషన్​లో ఉండటానికి చుట్టుపక్కలవారు అభ్యంతరం వ్యక్తం చేసిన ఘటన... కామారెడ్డిలో చోటుచేసుకుంది.

colony people objection to home isolation in kamareedy
హోం ఐసోలేషన్​కు కాలనీవాసుల అభ్యంతరం

By

Published : Aug 12, 2020, 9:50 AM IST

కామారెడ్డి జిల్లా వైద్యశాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగి బావకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా బాధితుడు ఇంతకు ముందు బామ్మర్ది ఇంట్లోనే ఉండేవాడు. అయితే ఆ ఇంట్లో డయాబెటిస్ పేషేంట్ ఉన్నారని... బాధితుడిని అతని సొంత ఇంటికి తరలించారు. అయితే కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు, వైద్య బృందం కాలనీకి వెళ్లి విచారణ చేపట్టి, కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఎన్జీవోస్ కాలనీలో ఇప్పటి వరకు 120 పాజిటివ్ కేసులు రాగా... 70 మంది వరకు హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స పొంది కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. బాధితుల పట్ల సానుకూలంగా ఉండి... వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details