కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా పాలనాధికారి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్లు, స్నానపు గదులను, తాగునీటి వసతులను పరీక్షించారు.
గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - కలెక్టర్ తాజా వార్త
మాచారెడ్డి మండలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను కామారెడ్డి జిల్లా పాలనాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన తాగునీరు అందిచాలని అధికారులకు సూచించారు.
గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
విద్యార్థులకు పరిశుభ్రమైన పాత్రలలో వండి పౌష్టికాహారం అందించాలని పాఠశాల యాజమాన్యానికి తెలిపారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. కొన్ని సంక్షేమ గురుకుల పాఠశాలలో పిల్లలకు పరిశుభ్రమైన తాగునీరునే అందించాలని, రోగాల బారిన పడకుండా విద్యార్థులను సంరక్షించాలని అధికారులను ఆయన హెచ్చరించారు.