తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు'

Nirmala Sitaraman on Telangana Debt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మార్చుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్రం ఒకపేరు పెడితే.. రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందని విమర్శించారు. కామారెడ్డి జిల్లా జహీరాబాద్​లో జరిగిన కోర్​ కమిటీ సమావేశంలో ఆమె కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

NIRMALA SITARAMAN
NIRMALA SITARAMAN

By

Published : Sep 1, 2022, 8:34 PM IST

Nirmala Sitaraman on Telangana Debt: తెలంగాణను మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తెలంగాణ రాష్ట్రం బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదని.. బడ్జెట్​లో చాలా అప్పులు చూపించడం లేదన్నారు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ 1.25 లక్షల అప్పు ఉందన్నారు. దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై సమాధానం చెప్పాలని కేసీఆర్​ను డిమాండ్ చేశారు.

ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్టుగా పెంచుతున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.20లక్షల కోట్లకు పెంచారని తెలిపారు. ‘మన ఊరు-మన బడి’ కేంద్ర పథకం అయితే దాన్ని రాష్ట్ర స్కీమ్‌గా క్లెయిమ్‌ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయనే ఆయుష్మాన్‌ భారత్‌లో చేరడం లేదని విమర్శించారు. తెలంగాణలో ప్రతి 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారని రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని గణాంకాలు ముందుంచారు. లిక్కర్‌ స్కామ్‌లో ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలని’నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

తెలంగాణలో మిగులు బడ్జెట్‌ కాస్తా లోటు బడ్జెట్‌ అయ్యింది. బడ్జెట్‌ అప్రూవల్‌ కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడంలేదు. బడ్జెట్‌లో చాలా అప్పులు చూపించడం లేదు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది. తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని తెలంగాణ దాటిపోయింది- నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థికమంత్రి

'తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు'

ABOUT THE AUTHOR

...view details