కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ మహోత్సవంలో భాగంగా బోనాల జాతరను వైభవంగా చేశారు.
ఐదేళ్లకోసారి ఘనంగా బోనాల జాతర - కామారెడ్డి జిల్లా తాజా వార్త
కామారెడ్డి జిల్లా ముత్యం పేట గ్రామంలో ఐదేళ్లకోసారి ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా చేస్తారు. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఐదేళ్లకోసారి ఘనంగా బోనాల జాతర
గౌడ కులస్తులేకాక గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున దేవతను దర్శించుకున్నారు. డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి బోనాలను సమర్పించుకున్నారు.