తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్ని ఖాళీలు ఉన్నాయో సీఎంకు అవగాహన లేదు: బీజేవైఎం

కామారెడ్డి జిల్లా టెక్రియాల్​లో బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. వివిధ శాఖల్లోని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సీఎం కేసీఆర్​కు అవగాహన లేదని విమర్శించారు.

bjym-protest-at-tekriyal-in-kamareddy-district
ఎన్ని ఖాళీలు ఉన్నాయో సీఎంకు అవగాహన లేదు: బీజేవైఎం

By

Published : Dec 29, 2020, 7:59 PM IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా టెక్రియాల్ జాతీయ రహదారిపై బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపుతో రహదారిపై బైఠాయించారు. ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి... దేవునిపల్లి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంతకృష్ణకు, పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న తీరు సరిగా లేదని అనంతకృష్ణ అన్నారు. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సీఎం కేసీఆర్​కు అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details