బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో భాజపా పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కిష్టానాయక్కు వినతి పత్రం అందజేశారు. పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా మండల అధ్యక్షుడు హండేకేలూర్ హన్మాండ్లు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
'రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలి'
కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరుతూ భాజపా నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
farmers loans waived immediately