తెలంగాణ

telangana

ETV Bharat / state

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఇద్దరి మృతి - latest news on bike collides divider two death at kyasampalli in kamareddy

అతివేగంతో వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

bike collides divider two death at kyasampalli in kamareddy
డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఇద్దరి మృతి

By

Published : Mar 14, 2020, 3:02 PM IST

కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారులోని బైపాస్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న రాహుల్‌, రమణ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన రాహుల్, కోటగిరి మండలానికి చెందిన అతని పెద్దమ్మ కొడుకు రమణ ఇద్దరూ హైదరాబాద్‌లోని ఈఎంఆర్‌ఐలో పని చేస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకని ఉదయం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. క్యాసంపల్లి వద్దకు రాగానే బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఇద్దరికీ 19 నుంచి 20 సంవత్సరాల వయసు ఉంటుందని.. ప్రమాద సమయంలో ఇద్దరూ ఇయర్‌ఫోన్‌లు వినియోగిస్తున్నట్లు కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఇద్దరి మృతి

ఇదీ చూడండి: సర్కార్ బడిలో ఎల్‌కేజీ, యూకేజీ.. ఎక్కడో తెలుసా..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details