ఆత్మ నిర్భర భారత్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం వీధి విక్రేతలకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా కామారెడ్డిలోనియూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా సిరిసిల్ల రోడ్డు బ్రాంచ్.. 100 మందికిపైగా వీధి విక్రేతలకు ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయల చొప్పున ఋణం మంజూరు చేసింది.
కరోనా సాయం.. వీధివిక్రేతలకు ఆత్మనిర్భర భారత్ నిధి - latest news of kamareddy
కరోనా కాలంలో ప్రజలకు ఆర్ధిక బలం చేకూర్చడానికి ప్రధాని ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర భారత్ పథకం కింద కామారెడ్డిలోని 100 మందికిపైగా వీధి వ్యాపారస్థులకు ఒక్కొక్కరికీ రూ.పదివేలు ఋణం మంజూరు చేసినట్టు జిల్లాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఆ జిల్లాలో 100 మందికిపైగా వీధివిక్రేతలకు ఆత్మనిర్భర భారత్ నిధి
ఈ లోన్‌కి వడ్డీ సబ్సిడీ కింద 7 శాతం గవర్నమెంట్ భరిస్తుంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తుండడం వల్ల చిరు వ్యాపారులు, వీధి విక్రేతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం తమకు కొంత ఆర్థిక బలాన్ని కలిగిస్తుందని వీధి వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:తహసీల్దార్ కార్యాలయంలో అన్నదమ్ముల ఆత్మహత్యాహత్నాం