కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామాన్ని అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గురువారం పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు.
పథకాలు అందరికీ అందుతున్నాయా?: అసిస్టెంట్ కలెక్టర్
హరితహారం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు గ్రామంలో అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పర్యటించి మొక్కలు నాటారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలోని ప్రతి ఇంటికీ పథకాలు అందుతున్నాయా? అసిస్టెంట్ కలెక్టర్
ప్రభుత్వ పథకాలు గ్రామాల్లోని ఇంటింటికి చేరుతున్నాయో లేదోనని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డుల్లో పర్యటించి మురుగు కాలువలను పరిశీలించారు. ఆయనతోపాటు ఎంపీడీవో రాజ్వీర్, తహసీల్దార్ శ్రీనివాస్ రావు, వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి:తహసీల్దార్ కార్యాలయంలో అన్నదమ్ముల ఆత్మహత్యాహత్నాం