ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణకై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు ఓ యువ మాస్టారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విధులు నిర్వహించే చిత్రలేఖన ఉపాధ్యాయుడు బాలకిషన్ తన కళతో ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాడు.
కళలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు - LOCK DOWN EFFECT
కామారెడ్డి జిల్లా మద్నూర్లోని ఓ యువ ఉపాధ్యాయుడు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు. తనకు తెలిసిన కళతోనే ప్రజలందరికీ నివారణ చర్యల గురించి వివరిస్తున్నాడు.
కళలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు
కుండలపై కరోనా బొమ్మతో పాటు భారతదేశ చిత్రపటం వేసి లాక్డౌన్గా చిత్రీకరించారు. ఈ రెండు బొమ్మలను పట్టుకొని కరోనా దెబ్బకు ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలియజేస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చేతుల శుభ్రతతో పాటు సామాజిక దూరం పాటించాలని తెలియచేస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని, అత్యవసర సమయంలో ఎవరైనా వెళ్లినా.... మాస్కులు కట్టుకోవాలని సూచిస్తున్నాడు.