సరిహద్దులో సిపాయి.. స్వగ్రామంలో దొంగ రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రపేటకు చెందిన షేక్ సోహెల్ భారత ఆర్మీలో సిపాయిగా పని చేస్తున్నాడు. గత సెప్టెంబర్ నెలలో తన స్వగ్రామానికి వచ్చాడు. తనకు ఉన్న చెడు వ్యసనాలకు, జల్సాలకు అధిక డబ్బు అవసరమై దొంగతనాలకు పాల్పడినట్టు కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మాచారెడ్డి మండలంలో తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి పారిపోతుండగా అతనిని పట్టుకుని విచారించారు. చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నాడు. గతంలో ఇతనిపై కామారెడ్డి, దేవునిపల్లి, భిక్కనూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఎస్పీ శ్వేత తెలిపారు. నిందితుని నుంచి మూడున్నర తులాల బంగారు నగలు, 130 తులాల వెండి ఆభరణాలు, 17000 నగదు, లైవ్ రౌండ్స్ 6, బుల్లెట్లు 5, దాగర్ కత్తి, ఎయిర్ పిస్తల్ స్వాధీన పరుచుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు. స్వాధీనపరుచుకున్న సొత్తు విలువ సుమారు ఒక లక్ష పదమూడు వేలు ఉటుందని అంచనా.