Monkey Pox in TS: రాష్ట్రంలో మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై.. అతడిని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలున్నట్లు బయటపడింది. ఈ నెల 6న అతను కువైట్ నుంచి కామారెడ్డి వచ్చారు. 20న జ్వరం వచ్చింది. 23 నాటికి ఒళ్లంతా రాషెస్ రావడంతో మరుసటి రోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్ లక్షణాలున్నట్టు గుర్తించడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించారు.
కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం.. బాధితుడు హైదరాబాద్‌కు తరలింపు - కామారెడ్డి
19:16 July 24
Monkey Pox in TS: ఈనెల 6న కువైట్ నుంచి కామారెడ్డి వచ్చిన వ్యక్తి
ప్రస్తుతం అతని నుంచి నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. అప్పటి వరకు ఫీవర్ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. అతనితో కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించి వారినీ ఐసోలేషన్ చేసినట్టు చెప్పారు. మంకీపాక్స్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ప్రాణాంతక వ్యాధి కాదని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఆయన సూచనల మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఇవీ చదవండి:మంకీపాక్స్ కలవరం.. భారత్‌లో పెరుగుతున్న కేసులు.. ఆ దేశాలు అలర్ట్
ప్రాజెక్టులకు మళ్లీ పోటెత్తుతోన్న వరదలు.. గేట్లెత్తిన అధికారులు