తెలంగాణ

telangana

ETV Bharat / state

కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు కొరికేసింది..

కోపంతో రగిలిన ఓ కోడలు అత్త ముక్కుమీద ప్రతాపం చూపింది. మాటలు, చేతులతో కాకుండా.. ఏకంగా నోటికే పని చెప్పింది. అత్త ముక్కును కోడలు కొరికింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మనపాడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు మీద ప్రతాపం
కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు మీద ప్రతాపం

By

Published : Dec 29, 2020, 1:13 PM IST

Updated : Dec 29, 2020, 1:53 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండల కేంద్రంలో అత్తపై కోడలు దాడి చేసింది. అత్తపై కోపాన్ని ఆపుకోలేక... ఏకంగా ముక్కునే కొరికేసింది. మంగలి జయన్న, శారదమ్మ భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. అన్నదమ్ముల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో చిన్న కోడలు రేవతి... అత్త జయమ్మ ఇద్దరు ఇంట్లో గొడవ పడ్డారు. దీనితో కోడలు ఆగ్రహంతో... అత్త ముక్కును కొరికింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి... జయమ్మకు ఏడు కుట్లు వేశారు.

Last Updated : Dec 29, 2020, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details