కృష్ణానదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద గల పలు ఆలయాల్లోకి నీరు చేరుతోంది. ఆలయ పరిసరాల్లోని కల్యాణకట్ట, అతిథిగృహ సముదాయం జలదిగ్బంధమయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆర్డీవో, తహసీల్దార్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. ప్రమాద హెచ్చరికలు జారీ చేయగానే తీరప్రాంత ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగాపురం సమీపంలో గల ఏబీ అండ్ డీ కర్మాగారానికి వెళ్లే దారిలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఫ్యాక్టరీ కార్మికులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కృష్ణానదికి ఉద్ధృతంగా కొనసాగుతున్న ప్రవాహం - krishna river
కృష్ణానదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బీచుపల్లి వద్ద గల పలు ఆలయాలు నీట మునిగాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
కృష్ణానదికి ఉద్ధృతంగా కొనసాగుతున్న ప్రవాహం