తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉరకలెత్తుతున్న కృష్ణా నది.. జూరాలకు భారీగా పెరిగిన వరద

జూరాల పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం కారణంగా జలాశయానికి వరద ఉద్ధృతి భారీగా పెరిగింది. ఫలితంగా 9 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి 71 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

The rising river Krishna .. a huge flood to the jurala
ఉరకలెత్తుతున్న కృష్ణా నది.. జూరాలకు భారీగా పెరిగిన వరద

By

Published : Jul 16, 2020, 6:47 AM IST

జూరాలకు వరద భారీగా పెరిగింది. కర్ణాటకతో పాటు జూరాల పరీవాహకంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం పైనుంచి 67 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. జలాశయంలో 9.56 టీఎంసీలు నిల్వ చేసి 9గేట్ల ద్వారా 71 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి 74 వేల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఇందులో జూరాల నుంచి 71 వేలు కాగా.. మిగిలింది హంద్రీ నది నుంచి వచ్చింది. జలాశయం పూర్తి సామర్థ్యం 8.750 టీఎంసీలు కాగా.. ఇన్​ఫ్లో 82,818 క్యూసెక్కులు, ఔట్​ఫ్లో 78,898 క్యూసెక్కులుగా ఉంది.

జూరాల ద్వారా నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, జూరాల కుడి, ఎడమ కాలువలు, సమాంతర కాలువలకు నీటిని విడుదల చేశారు. మరోవైపు ఆలమట్టిలోకి 27వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 46 వేల క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. నీటిమట్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నారాయణపూర్‌ నుంచి 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా.. నారాయణపూర్‌-జూరాల మధ్య, భీమా నది ప్రాంతంలో కురిసే వర్షాలతో జూరాలకు ఎక్కువ ప్రవాహం ఉంది.

తొమ్మిది యూనిట్లతో 340 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి..

కృష్ణానదికి వరద పెరగడం వల్ల ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ద్వారా కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. పీజేపీ అధికారులు 20,990 క్యూసెక్కులను విద్యుత్తు ఉత్పత్తి కోసం విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో 5, దిగువ జూరాల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా ఉత్పత్తిని చేపట్టారు. ఒక్కో యూనిట్‌ ద్వారా గరిష్ఠంగా 40 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది.

ఇదీచూడండి: పోటీ ప్రపంచంలో కేవలం పట్టాలు సంపాదిస్తే సరిపోదు: గవర్నర్​

ABOUT THE AUTHOR

...view details