జోగులాంబ గద్వాల జిల్లాలోని గుందిమల్లలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన తల్లి తారకమ్మ అస్తికలను కృష్ణా నదిలో కలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణానదిలో అస్తికలను కలిపి.. తారకమ్మకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు. తన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి వెంట జోగులాంబ గద్వాల జిల్లా ఛైర్పర్సన్ సరిత, తెరాస నాయకులు ఉన్నారు.
తల్లి అస్తికలను కృష్ణానదిలో కలిపిన మంత్రి నిరంజన్ రెడ్డి - మంత్రి నిరంజన్‌రెడ్డి
తన తల్లి తారకమ్మ అస్తికలను మంత్రి నిరంజన్‌రెడ్డి కృష్ణానదిలో కలిపారు. తారకమ్మకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేసి ఆత్మకు శాంతి చేకూరాలని పూజలు నిర్వహించారు.
తారకమ్మ