తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాల ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు - జోగులాంబ గద్వాల జిల్లా

మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు పెద్దదిక్కుగా ఉన్న జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. గత మూడు రోజులుగా కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరడం వల్ల జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లకు ప్రస్తుతం 318.380 మీటర్లుగా ఉంది.

జూరాల ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు

By

Published : Aug 2, 2019, 2:02 PM IST

జూరాల ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు మూడు రోజుల నుంచి స్థిరంగా వరద కొనసాగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరడం వల్ల జలాశయం నిండుకుండ తలపిస్తుంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లకు ప్రస్తుతం 318.380 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టులోకి లక్షా 91 వేల 350 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. స్పిల్ వే ద్వారా లక్షా 58 వేల 96 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ నుంచి 23 వేల 387 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు 1500 క్యూసెక్కులు, భీమవరం 1300, కోయిల్ సాగర్ 249 క్యూసెక్కుల నీరు ఎత్తిపోతల పథకాలకు అధికారులు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details