ఐరన్ మాత్రలు వికటించి జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 11 గంటలకు విద్యార్థులకు ఐరన్ మాత్రలు ఇవ్వగా... సాయంత్రం 4 గంటలకు వాంతులయ్యాయి. గమనించిన స్థానికులు విద్యార్థులను ఇటిక్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు 10 మందికి పైగా ఉండటం వల్ల గద్వాల నుంచి డాక్టర్లు వచ్చి వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రాములు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఐరన్ మాత్రలు వికటించి 68మంది విద్యార్థులకు అస్వస్థత - students
జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరంలో ఐరన్ మాత్రలు వికటించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఐరన్ మాత్రలు వికటించి 68మంది విద్యార్థులకు అస్వస్థత