గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పారిశుద్ధ్య పనులకు గాను బిల్లులు చెల్లించాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా మనపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆందోళన చేపట్టారు.
మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ల నిరసన - గద్వాల ప్రాంతీయ వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండల కేంద్రంలో సర్పంచ్లు ఆందోళన చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసనకు దిగారు.
మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ల నిరసన
ఇసుక కొరత వల్ల గ్రామాల్లో పనులు జరగడం లేదని పేర్కొన్నారు. సమావేశమందిరంలో కింద కూర్చుని నిరసన తెలిపారు. సమావేశానికి హాజరైన జడ్పీఛైర్పర్సన్ సరిత... గ్రామ ప్రథమపౌరులకు సర్దిచెప్పారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:ఆస్తికోసం తల్లి అంత్యక్రియలకు అడ్డుపడిన పుత్రరత్నం