Revanth Reddy Public Meeting at Alampur: కాంగ్రెస్ పార్టీ ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తోంది. ముఖ్యనేతలు నియోజకవర్గాలకు వెళ్లి.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకూ అయిదు రోజుల్లో 14 నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పాల్గొననున్నారు. మంగళవారం అలంపూర్‌లో జోగులాంబ శక్తిపీఠం ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కరించే బాధ్యత.. రేవంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో సంపత్‌కు ఇచ్చిన బీఫామ్‌ను కాదని అబ్రహంకు ఇచ్చారని గుర్తు చేశారు. సంపత్‌ను కాదని మీరు అబ్రహాన్ని గెలిపిస్తే.. ఇప్పుడు అబ్రహాన్ని తప్పించి మరొకరిని రప్పించారని విమర్శించారు.
16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి
Revanth Reddy Speech at Alampur Meeting : బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత తనదేని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో పాటు బోయలకు ఎమ్మెల్సీ ఇస్తానని తెలిపారు. కేసీఆర్(KCR), కేటీఆర్, హరీశ్‌రావు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారని విమర్శించారు. పాలమూరులో పార్టీలు గ్రూప్‌లకు అతీతంగా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. తాను 3 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తానని అన్న మాటలు నిరూపించాలని సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. బీఆర్ఎస్ 24 గంటలు కరెంట్ ఇస్తుందని.. రాష్ట్రంలో ఏ సబ్‌స్టేషన్‌కు వెళ్లైనా 24 గంటలు కరెంట్ వస్తున్నట్లు చూపించాలని ప్రశ్నించారు.
Revanth Reddy Latest Comments on CM KCR : 2014లో ధరణి రాకముందే.. 2018 రైతు బంధు వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2006-07లోనే వైఎస్ రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ధరణి లేకుండానే రుణమాఫీ జరిగిందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు(Rythu Bandu) అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి లేకముందే ఎరువుల సబ్సిడీ.. రైతులకు వ్యవసాయ పనిముట్లు కూడా ఇచ్చారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ధరణి ఏటీఎంలా మారిందని ఆరోపించారు.