కరోనా సాకుతో మాస్కులు, శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తే మందుల దుకాణ యజమానులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని పలు మందుల దుకాణాలను శాంతినగర్ సీఐ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
అధిక ధరలకు మాస్కులు.. దుకాణాలపై పోలీసుల దాడులు - corona news in telangana
మాస్కులు, శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని మందుల దుకాణాల్లో సిబ్బందితో కలిసి శాంతినగర్ సీఐ తనిఖీలు నిర్వహించారు.
'కరోనా సాకుతో సొమ్ము చేసుకోవాలని చూస్తే చర్యలు తప్పవు'
వడ్డేపల్లి, ఐజ, అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మందుల దుకాణాల్లో తనిఖీ చేసి ధరలపై ఆరా తీశారు. మాస్కులు, శానిటైజర్లు ఎక్కువ ధరకు విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.