తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2020, 10:48 PM IST

ETV Bharat / state

గద్వాల జిల్లాలో కరోనా వైరస్‌ పరీక్షల ల్యాబ్‌ ఏర్పాటు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పరీక్షలు చేయాలంటే హైదరాబాద్‌ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష చేసుకోవాల్సి వస్తుందని గద్వాల జిల్లా వైద్య అధికారులు తెలిపారు. దీంతో కాలం వృథా అవడమే కాక వ్యాధి విజృంభిస్తుందన్నారు. అందుకే గద్వాల ప్రజల కోసం జిల్లా ప్రభుత్వ ఐసోలేషన్‌ వార్డులో వైరస్‌ పరీక్షల నిర్ధరణ కోసం ల్యాబ్‌ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

గద్వాల జిల్లాలో కరోనా వైరస్‌ పరీక్షల ల్యాబ్‌ ఏర్పాటు
గద్వాల జిల్లాలో కరోనా వైరస్‌ పరీక్షల ల్యాబ్‌ ఏర్పాటు

గద్వాల ప్రభుత్వ ఐసోలేషన్ వార్డులో కొవిడ్‌ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తున్నందున జిల్లా అధికారులు, గద్వాల శాసనసభ్యుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం వల్ల ఈ ఏర్పాటు జరిగినట్లు పేర్కొన్నారు.

ఈ పరీక్షలను గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి భీమానాయక్ తెలిపారు. మొదటి రోజు ఎనిమిది మందికి పరీక్షలు చేశామని.. 24 గంటల్లో ఫలితాలు వస్తాయని అధికారులు వెల్లడించారు. ఎవరైనా అనుమానితులు ఉంటే వచ్చి వైరస్‌ నిర్ధరణ చేసుకోవచ్చన్నారు. ల్యాబ్‌లో డాక్టర్ ఇర్షాద్‌తో సహా ఐదు మంది టెక్నీషియన్స్ పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details