తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాల గేట్లు ఎత్తిన అధికారులు... శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం పెరగడం వల్ల ప్రాజెక్టు ఆరు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Jurala water release
జూరాలకు పెరుగుతున్న వరద... ఆరుగేట్లు తెరిచి నీటి విడుదల

By

Published : Jul 15, 2020, 9:47 AM IST

Updated : Jul 15, 2020, 10:11 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది. జలాశయానికి 40,076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలకుగాను... ప్రస్తుతం 9.500 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం పెరగడం వల్ల జలాశయం 6 గేట్లు తెరిచి 28,641 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, బీమాకు 650, కోయిల్ సాగర్​కు 630, కుడి కాలువకు 252, ఎడమ కాలువకు 700, పార్లల్ కెనాల్​కు 900 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద నీరు పెరుగుతుండటంతో.... ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలోని ఆరు జల విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోంది. వరద ప్రవాహం పెరగటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

శ్రీశైలంలో పెరుగుతున్న వరద

శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, హంద్రీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 56,570 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయ ప్రస్తుత నీటి మట్టం 815.50 అడుగులు ఉండగా... 37.6570 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

జూరాల గేట్లు ఎత్తిన అధికారులు... శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

ఇదీ చూడండి:భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన

Last Updated : Jul 15, 2020, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details