తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ఏర్పాటుతో ఈగ్రామాల ప్రజలకు కొత్త కష్టాలు

summary: తెలంగాణ రాష్ట్రం వస్తే సౌకర్యాలు మెరుగుపడతాయనుకున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కలలు కన్నారు. వారి కలలు కల్లలయ్యాయి. కనీస సదుపాయాలు లేక జోగులాంబ గద్వాల జిల్లాలోని ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెలపాడు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఈగ్రామాల ప్రజలకు కొత్త కష్టాలు

By

Published : Mar 21, 2019, 10:09 PM IST

ఈగ్రామాల ప్రజలకు కొత్త కష్టాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమవుతాయని, సౌకర్యాలు మెరుగుపడతాయని వారంతా ఆశించారు. కొత్త సదుపాయాలు మాటేమోగాని ఉన్నవి కాస్త దూరమయ్యాయి.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ మండలం పరిధిలోని ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లెలపాడు గ్రామాల్లో సమస్యలు తిష్ట వేసుకుని కుర్చొన్నాయి. ఈ గ్రామాలన్నీ తుంగభద్ర నదికి అవతల వైపు ఉండడం, రహదారి సౌకర్యాలు లేకపోవడం... ఉన్న ఒక్క వంతెన పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఏం కావాలన్నా అలంపూర్​కే..

శ్రీశైలం బ్యాక్​ వాటర్​ కారణంగా అలంపూర్​ వద్ద తుంగభద్ర నదిలో ఎల్లప్పుడు నీరుంటుంది. ఏం కావాలన్నా ఆ మూడు గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన అలంపూర్​కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రమాదమని తెలిసినా సరైన రహదారి సౌకర్యం లేక కేసీ కెనాల్​పైనా... మత్స్యకారులు చేపలు పట్టే పుట్టీల ద్వారానే ప్రయాణాలు సాగిస్తున్నామని.. ప్రజలు వాపోతున్నారు.

వారికి తెలంగాణలో ఉద్యోగాలు రావు..

రహదారి సౌకర్యం లేక రాయలసీమకు వెళ్లి పిల్లలు చదువుతున్నారని... వారందరిని అక్కడ నాన్​లోకల్​ కేటగిరి కిందనే గుర్తిస్తున్నారన్నారు. అక్కడ చదవడం వల్ల తెలంగాణలో వారికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని వాపోయారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నందికొట్కూరు నుంచి బస్సు సర్వీసులు ఉండేవని విభజన అనంతరం పూర్తిగా సేవలు నిలిపేశారన్నారు.

తాగునీటి సమస్య అధికంగా ఉందని.. ఊరిలో ఒక్కే ట్యాంకు ఉందని విద్యుత్​ లేకపోతే తాగునీరు దొరికే పరిస్థితి లేదన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వాపోయారు.

అత్యవసర సమయాల్లోనూ ఆటోలు, ద్విచక్ర వాహనాలతో కేసీ కెనాల్​ కట్టలపై ప్రయాణాలు సాగిస్తున్నామని.. కనీస మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు.
ఇవీ చూడండి:ఈటీవీ భారత్​కు ఎంపీ కవిత శుభాకాంక్షలు...

ABOUT THE AUTHOR

...view details