తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంత కోసం మాకు ప్రత్యేక స్థలం కావాలి'

అలంపూర్ పురపాలిక పరిధిలోని వారాంతపు సంతలో మౌలిక సౌకర్యాలు కరవయ్యాయి. సరకులు, కూరగాయలు రోడ్డుపైనే నిలబడి కొనుగోలు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మార్కెట్ స్థలం కేటాయించాలని కోరుతున్నారు.

సంత బజారుకు సరైన స్థలం ఏర్పాటు చెయ్యాలి : స్థానిక ప్రజలు

By

Published : Jun 13, 2019, 10:29 PM IST

అలంపూర్ పట్టణంలో ప్రతి గురువారం సంత జరుగుతుంది. ఈ వారాంతపు సంతకు పట్టణ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల ప్రజలూ వస్తారు. సింగవరం, కాశిపురం, బైరాన్​పల్లి, ర్యాలంపాడు తదితర గ్రామాల ప్రజలు సంతకు వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. రోడ్డుపై నిలబడేసరుకులుకొంటున్నా.. ఇప్పటి వరకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం గమనార్హం.

పేద ప్రజలు ఎక్కువగా వారాంతపు సంతలపైనే ఆధారపడుతుంటారు. సంతలో సరుకులు అమ్మే వారికి కూడా సరైన సౌకర్యాలు లేవు. పంచాయతీ గేటు టోల్ రుసుము మాత్రం వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం అలంపూర్ మునిసిపాలిటీగా మారింది. అధికారులు ఇకనైనా సంత బజారుకు సరైన స్థలం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇకనైనా మార్కెట్ స్థలం కేటాయించాలి : స్థానికులు

ఇవీ చూడండి : చెక్​పవర్​ ఇవ్వట్లేదని సర్పంచ్​ భిక్షాటన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details