జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన భవనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో వనపర్తి జిల్లాతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని మంత్రి వెల్లడించారు. గద్వాల పట్టణంలో కొత్తగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
'జిల్లాను అభివృద్ధి చేస్తా' - kcr
జోగులాంబ గద్వాల జిల్లాను అభివృద్ధి చేస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. గద్వాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.
మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి