జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో కరోనా కట్టడిపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, జిల్లా కలెక్టర్ శృతి ఓఝా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్పర్సన్లు హాజరయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్నాయన్న సమాచారంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
కరోనా కట్టడిపై ఆరోగ్య శాఖ అధికారులు సమావేశం - అఖిలపక్షం నాయకులు
కరోనా కట్టడిపై జిల్లా అధికారులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి నియంత్రణలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు తీసుకుంటున్న చర్యలపై అధికారులు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం చేపట్టారు. కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయన్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం సమీక్ష చేపట్టారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్లు జిల్లాలో పర్యటించి స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిపారు. సమావేశంలో జిల్లాలోని అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలతోపాటు జడ్పీ ఛైర్పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా, జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు జిల్లా అఖిలపక్షం నాయకులు జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
ఇదీ చూడండి:Petrol Price : రాష్ట్రంలో 5 జిల్లాల్లో రూ.100 దాటిన పెట్రోల్ ధర