జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ అపూర్వ రావు ప్రారంభించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం నిరంతరం కష్టపడుతున్న పోలీస్ సిబ్బంది శ్రేయస్సు కోసమే ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు - పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు
లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయటం కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది... తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ అపూర్వ రావు సూచించారు.
ప్రతి ఒక పోలీస్ అధికారికి షుగర్‌కు సంబంధించిన రక్త పరీక్షలు, హైపర్ టెన్షన్, ఆక్సిజన్ స్థాయి, పల్స్ రేటు, శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకోవడంతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు. వైద్య పరీక్షలను ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని ఎస్పీ సూచించారు. వైద్య పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ శిబిరానికి కావల్సిన మందులను శాంతి నగర్‌లోని నేత్ర ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వరద రవికుమార్, గద్వాల జిల్లా ఆస్పత్రి, వైద్య ఆరోగ్య శాఖ వారు సరఫరా చేశారు.