జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ శృతి ఓజా చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు ఆలయ ఈవో, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అలంపూర్‌లో మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ - అలంపూర్ తాజా వార్త
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను కలెక్టర్ శృతి ఓజా ప్రారంభించారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
అలంపూర్‌లో మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్
జోగులాంబ అమ్మవారి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి:'టిండర్' ఎఫెక్ట్: స్నేహం పేరుతో మోసం చేసిన హైటెక్ కిలాడి