తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు - జూరాల ప్రాజెక్టు

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా, తుంగభద్ర నదులు జలకళ సంతరించుకోనున్నాయి. ఇవాళ రాత్రికి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 86వేల 243క్యూసెక్కుల వరద ప్రవాహం రానుంది.

జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు

By

Published : Jul 29, 2019, 7:22 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకోనుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టులు నిండటం వల్ల అధికారులు నీటిని దిగువకు వదలనున్నారు. ఇవాళ రాత్రి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 86వేల 243క్యూసెక్కుల వరద ప్రవాహం రానుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.66 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 1.99 టీఎంసీలు ఉన్నాయి. తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద నీరు పోటెత్తుతోంది.

ఇవాళ జూరాలకు వరదనీరు

ABOUT THE AUTHOR

...view details