జూరాల జలాశయం 22 గేట్లు ఎత్తి నీటి విడుదల - జూరాల జలాశయం గేట్లు ఎత్తి నీటి విడుదల
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల 22 గేట్లు తెరిచి 2.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
jurala project
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి 2.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం 22 గేట్లు తెరిచి 2.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
జూరాల జలాశయం
- పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు
- ప్రస్తుత నీటి మట్టం 317.790 మీటర్లు
- పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ 8.203 టీఎంసీలు